టీమిండియా కొత్త జెర్సీ ఎలా వుంది?

Update: 2019-06-30 08:50 GMT

వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ తో కొద్దిసేపట్లో తలపడబోతున్న టీమిండియా ఈ రోజు కొత్త జెర్సీ తో బరిలోకి దిగబోతోంది. ఇంగ్లాండ్, టీమిండియా రెండు టీముల జేర్సీలు ఒకే రకంగా ఉండదడంతో ఇంగ్లాండ్ తో మ్యాచ్ కోసం ప్రత్యేకంగా జెర్సీ రూపొందించింది బీసీసీఐ. ఆ జేర్సీలతో ఆటగాళ్ల ఫోటో షూట్ చేసి వాటిని సామాజిక మాధ్యమాలలో విడుదల చేశారు. కొత్త లుక్..కొత్త రంగుల కలయికతో ఆ జేర్సీలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఇపుడు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ సైతం కొత్త జెర్సీకి రేటింగ్‌ ఇచ్చాడు. పదికి ఎనిమిది పాయింట్లు ఇస్తున్నట్లు తెలిపాడు. ఇంగ్లాండ్‌తో పోరుకు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న అతడు కొత్త జెర్సీతో పాటు ఇతర అంశాలపై స్పందించాడు.

తనకు ఈ జెర్సీ చాలా నచ్చిందని, ముదురు రంగు బాగుందని కోహ్లీ అన్నాడు. అలాగే ఇది ఒక్క మ్యాచ్‌కే పరిమితమవడం విశేషంగా ఉందన్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో సాంప్రదాయక నీలం రంగు జెర్సీని ధరించడమే ఇష్టమని, ఆ జెర్సీ ధరిస్తే తనకు గౌరవప్రదంగా ఉంటుందని వివరించాడు. అలాగే ఒత్తిడి గురించి అడిగిన ప్రశ్నకు.. ఒత్తిడి ఉంటేనే తాను మరింత మెరుగ్గా రాణిస్తానని, కాకపోతే అది ఎవరికీ కనిపించదని చెప్పాడు. ఒత్తిడిలో మ్యాచ్‌ గెలిచి మైదానం నుంచి బయటకి వచ్చినప్పుడు గర్వంగా ఉంటుందని పేర్కొన్నాడు.

Tags:    

Similar News