సురేశ్ రైనా కాలికి సర్జరీ.. క్రికెట్‌కు దూరం

టీం ఇండియా హిట్టర్ సురేష్ రైనా మోకాలికి చికిత్స జరిగింది. సర్జరీ కారణంగా ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నారు.

Update: 2019-08-10 07:40 GMT

టీం ఇండియా హిట్టర్ సురేష్ రైనా మోకాలికి చికిత్స జరిగింది. సర్జరీ కారణంగా ఆరు వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నారు. నెదర్‌లాండ్స్‌లోని అమస్టర్‌డామ్ వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. కొన్ని నెలలుగా మోకాలి సమస్యతో బాధపడుతున్న రైనా అమస్టర్‌డ్యామ్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతమైందని కోలుకునేందుకు 4-6 వారాల సమయం పడుతుందని రైనాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ వెల్లడించాడు. భారత్‌ తరపున గత ఏడాది జులైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా టీమ్‌లో చోటు కోల్పోయాడు. కానీ.. దేశవాళీ క్రికెట్‌లో రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. చివరగా ఈ ఏడాది ఐపీఎల్ 2019 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడి సత్తా చాటాడు సురేశ్ రైనా. 

Tags:    

Similar News