3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక

Update: 2019-06-28 10:47 GMT

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్ మెన్ ను సౌతాఫ్రికా బౌలర్లు కుడురుకోనివ్వటం లేదు. శ్రీలంక వేగంగా పరుగులు సాధిస్తున్నప్పటికీ వికెట్లు కూడా కోల్పోయింది. మొదటి ఓవర్ మొదటి బంతికే వికెట్ కోల్పోయిన శ్రీలంకను ఫెర్నాండోతో కలసి కుశాల్‌ పెరీరా ఆసుకున్నాడు. తొమ్మిదో ఓవర్ వరకూ వీరిద్దరూ సౌతాఫ్రికా బౌలర్ల పై ఆధిపత్యం చలాయించారు. అయితే, ప్రిటోరియస్‌ వేసిన 10వ ఓవర్‌ ఐదో బంతికి షాట్‌ ఆడబోయిన అవిష్క ఫెర్నాండో (30;29 బంతుల్లో) డు ప్లెసిస్‌ చేతికి చిక్కాడు. దీంతో 10 ఓవర్లకు ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. తరువాత నిలకడగా ఆడుతున్న కుశాల్‌ పెరీరాను ( 30; 34 బంతుల్లో) ప్రిటోరియస్‌ 12వ ఓవర్‌ మూడో బంతికి బౌల్డ్‌ చేశాడు. దీంతో లంక మూడో వికెట్ ను కోల్పోయింది. మొత్తమ్మీద శ్రీలంక జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. మెండిస్ 7 పరుగులతోనూ, మాథ్యూస్ 4 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News