ఎట్టకేలకు శ్రీశాంత్‌కు విముక్తి..

గత కొద్ది సంవత్సారాల నుండి మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణల కింద విధించిన జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని పోరాటం చేస్తున్న భారత శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది.

Update: 2019-08-20 11:31 GMT

గత కొద్ది సంవత్సారాల నుండి మ్యాచ్ ఫిక్సింగ్‌ ఆరోపణల కింద విధించిన జీవితకాల నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా జీవితకాల నిషేధాన్ని తగ్గించాలని పోరాటం చేస్తున్న భారత శ్రీశాంత్‌కు భారీ ఊరట లభించింది. శ్రీశాంత్‌పై ఉన్న జీవిత కాల నిషేధాన్ని ఏడేళ్ల వరకే బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ నిర్ణయం తీసుకున్నారు. గత ఆరేళ్లుగా నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్‌ ప్రవర్తన బాగుందని భావించిన అంబుడ్స్‌మన్‌ శ్రీశాంత్ పై ఉన్న జీవిత కాల నిషేధాన్ని రద్దు చేశారు. ఇక ఈ క్రమంలోనే ఏడేళ్ల నిషేధం సరిపోతుందని స్పష్టం చేశారు. ఫలితంగా వచ్చే ఏడాది ఆగస్టు నెలకు శ్రీశాంత్‌పై ఉన్న నిషేధం తొలగిపోనుంది. ప్రస్తుతం శ్రీశాంత్‌కి 36 ఏళ్లు. కేరళ తరఫున, విదేశీ లీగుల్లో ఆడాలని శ్రీశాంత్ కోరుకుంటున్నాడు.

Tags:    

Similar News