ఎదురీదుతున్న సౌతాఫ్రికా

Update: 2019-05-30 13:56 GMT

ప్రపంచ కప్ తోలి మ్యాచ్ లో 312 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా త్వరత్వరగా రెండు వికెట్లు కోల్పయింది. 3 ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 10 పరుగులు చేశారు సౌతాఫ్రికా ఓపెనర్లు. నాలుగో ఓవర్లో దక్షిణాఫ్రికాకు అనుకోని దెబ్బ తగిలింది. నిలకడగా ఆడుతున్న ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా (5; 8 బంతుల్లో 1×4) రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు. జోఫ్రా ఆర్చర్‌ 145 కిలోమీటర్ల వేగంతో విసిరిన 3.5వ బంతి ఆమ్లా హెల్మెట్‌ గ్రిల్స్‌కు గట్టిగా తగిలింది. వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించాడు. అతడికి బాగానే ఉన్నా ముందు జాగ్రత్త చర్యగా డ్రెస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లారు. అనంతరం జోఫ్రా ఆర్చర్‌ వేసిన 7 వ ఓవర్లో 4వ బంతిని కట్‌ చేయబోయి అయిడెన్‌ మార్క్రమ్‌ (11; 12 బంతుల్లో 2×4) అవుటయ్యాడు. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్‌ కు  జోఫ్రా ఆర్చర్‌ షాక్ ఇచ్చాడు. జట్టు స్కోరు 44 వద్ద ఉన్నపుడు, తొమ్మిదో ఓవర్లో డుప్లెసిస్ 5 పరుగులు చేసి మొయిన్‌ అలీకి క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఇపుడు దక్షిణాఫ్రికా స్కోరు 14  ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 73 పరుగులు. 

 

   

Similar News