ధీటుగా స్పందిస్తున్న సౌతాఫ్రికా

Update: 2019-06-02 14:19 GMT

వరల్డ్ కప్ లో తానాడుతున్న రెండో మ్యాచ్ లో ఈరోజు బంగ్లాదేశ్ తో సౌతాఫ్రికా తలపడుతోంది. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి రేసులో ఉండడం తో పాటు టోర్నీలో తదుపరి మ్యాచుల కోసం ఆత్మవిశ్వాశాన్ని పెంచుకోవాలని పట్టుదలతో సఫారీలు ఉన్నారు. మొదటి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీమ్ 331 లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. ప్రతిగా బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీలు ఒక్క వికెట్ నష్ట పోయి  పది ఓవర్లకు  51  పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉన్నారు. ఆచితూచి ఆడిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు  క్వింటన్‌ డికాక్‌, మార్‌క్రమ్‌లు బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.  వీరిద్దరూ సింగిల్స్‌ తీస్తూ స్ట్రైక్‌రొటేట్‌ చేస్తూ, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదారు. దీంతో 9 ఓవర్లకు 48 పరుగులు చేశారు. అయితే, పదో ఓవర్లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ (23; 32 బంతుల్లో) ఔటయ్యాడు. మరో బ్యాట్స్‌మన్‌ మార్‌క్రమ్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో పది ఓవర్లకు ఆ జట్టు వికెట్‌ నష్టానికి 51 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మార్‌క్రమ్‌ , ఫా డు ప్లెసిస్‌  ఉన్నారు. 

Similar News