వర్షం అంతరాయం..నిలిచిన మ్యాచ్‌

Update: 2019-06-10 10:44 GMT

ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-విండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించాడు. 7.3 ఓవర్ వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు 7.3 ఓవర్లలో రెండు వికెట్లకు 29 రన్స్ చేసింది. జోష్‌లో ఉన్న కరీబియన్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ 2 వికెట్లు తీసి సౌతాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు. డికాక్(17), డుప్లెసిస్(0) క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News