టెస్టు సీరీస్ లో ఒక పింక్ బాల్ మ్యాచ్ ఒకటైనా ఉండాలి : గంగూలీ

జరగబోయే ప్రతి టెస్ట్ సిరీస్ లలో కనీసం ఒక్క పింక్ బాల్ మ్యాచ్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు బీసీసీఐ నూతన అధ్యక్షుడు గంగూలీ.

Update: 2019-12-05 09:23 GMT
గంగూలీ

జరగబోయే ప్రతి టెస్ట్ సిరీస్ లలో కనీసం ఒక్క పింక్ బాల్ మ్యాచ్ ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు బీసీసీఐ నూతన అధ్యక్షుడు గంగూలీ.. అన్ని మ్యాచ్ లు కాకపోయినా కనీసం ఎదో ఒక మ్యాచ్ అయినా ఉంటే బాగుంటుందని అన్నారు. పింక్ బాల్ టెస్టులు ఆడేందుకు స్టేడియాలు కూడా సిద్దంగా ఉన్నాయని అన్నారు గంగూలీ.. మొదటి పింక్ బాల్ టెస్ట్ కోల్ కత్తా ఈడెన్ గార్డెన్ లో జరిగిన తర్వాత తనకు చాలా సంతోషాన్ని కలిగించిందని అన్నారు.

పింక్ టెస్ట్ మ్యాచ్ ని చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు రావడం చూసి ఆశ్చర్యపోయాననని అన్నారు. నాలుగు రోజుల ముందే టికెట్స్ బుక్ అయిపోవడం సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. ఇక భారత జట్టు కెప్టెన్ కోహ్లీ డై/నైట్ టెస్టుపై పాజీటివ్ గానే స్పందించాడని, కానీ ప్రతీ మ్యాచ్ డేనైట్ ఆడలేమని చెప్పాడని గంగూలీ చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News