సచిన్ సరసన రోహిత్ ..

Update: 2019-07-07 01:38 GMT

ప్రపంచ కప్ : ప్రపంచ కప్ లో భారత జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేయడమే కాకుండా తన ఖాతాలో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నాడు రోహిత్ శర్మ . ఇప్పటికే ఈ ప్రపంచ కప్ లో ఐదు సెంచరీలు బాదీ గతంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర పేరిట ఉన్న నాలుగు సెంచరీల రికార్డను బ్రేక్ చేసాడు రోహిత్ .. అంతే కాకుండా భారత మాజీ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట మరో రికార్డును సమం చేసాడు.. ప్రపంచ కప్ లో అత్యదిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ (6) పేరిట ఉంది . ఈ టోర్నీ లో మొత్తం అయిదు శతకాలు బాదినా రోహిత్ 647 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు . గతంలో సచిన్ 2003 ప్రపంచ కప్ లో 673 పరుగులు సాధించాడు . 2007 ప్రపంచ కప్ లో ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్‌ 659 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానంలో రోహిత్‌ నిలిచాడు. భారత్ తన సెమిస్ మ్యాచ్ ని మంగళవారం న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది .. 

Tags:    

Similar News