రవిశాస్త్రికి తొలిగిన అడ్డంకులు.. మళ్లీ తనే టీమిండియా కోచ్?

* టీం ఇండియా ప్రధాన కోచ్ గా మళ్లీ రవిశాస్త్రి కే దక్కేలా ఉన్న చాన్స్ * విదేశీ కోచ్ లు వద్దని నిర్ణయం తీసుకున్న బీసీసీఐ * పోటీ నుంచి టాం మూడీ, కిరిస్టిన్ అవుట్! * త్వరలో దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూలు పూర్తి చేయనున్న బీసీసీఐ

Update: 2019-08-08 02:57 GMT

టీమిండియా కోచ్ పదవి రావిశాస్త్రి తిరిగి చేపట్టనున్నారా? ఆయనకి లైన్ క్లియర్ అయినట్టేనా? ఇక ప్రకటన రావడమే ఆలస్యమా? ఈ ప్రశ్నలన్నిటికీ అధికారికంగా జవాబులు దొరకడానికి కొంత సమయం పట్టొచ్చు. కానీ, పరిస్థితులు చూస్తుంటే, తిరిగి రావిశాస్త్రి టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టడడం దాదాపు ఖాయం.

టీమిండియాకు వివిధ విభాగాలకు కోచ్ లు, సహాయ సిబ్బంది కోసం బీసీసీఐ ఇటీవల దఖాస్తులు ఆహ్వానించింది. అదేవిధంగా ప్రధాన కోచ్ పదవికీ దఖాస్తులు పిలిచింది. ఈ పదవికి దాదాపు 2000 మంది దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వారిలో కొందరి మధ్య మాత్రమె పోటీ ఉంటుందని భావించారు. వారిలో అత్యధికులు విదేశీయులు. ముఖ్యంగా టామ్ మూడీ, గ్యారీ కిరిస్టన్, మైక్ హసన్, మహేల జయవర్దనె వంటి వారు ఉన్నారు. అయితే, బీసీసీఐ ప్రస్తుతం విదేశీ కోచ్ లను తీసుకోకూడదని నిర్ణయం తీసుకుంది. దీంతో స్వదేశీయుల దరఖాస్తులే పరిశీలించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ నిబంధనల ప్రకారం అర్హతలు కలిగివున్న వారు దఖాస్తుదారులలో నలుగురైదుగురికి మించి ఉండే అవకాశం లేదు. అయితే, వీరిలో కూడా రాబిన్ సింగ్, రావిశాస్త్రిల మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంది. కనీ, రావిశాస్త్రి అనుభవం ముందు రాబిన్ సింగ్ అనుభవం చాలా తక్కువ. దీంతో ఇక మిగిలింది రావిశాస్త్రి మాత్రమె. అందువలన ఎటుతిరిగీ రావిశాస్త్రి మరోమారు టీమిండియా కోచ్ గా పగ్గాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. దాదాపుగా ఇది ఖాయం అయినట్టే అని బీసీసీఐకి చెందిన విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

హెడ్ కోచ్ నియామక బాధ్యతల్ని పాలకుల కమిటీ.. దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ నాయకత్వంలో కమిటీకి అప్పగించిన నేపథ్యంలో.. ఆ కమిటీ ఈనెల 14, 15న అభ్యర్థులకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఆ తర్వాతే కోచ్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం భారత్ జట్టు రవిశాస్త్రి పర్యవేక్షణలో వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది.


Tags:    

Similar News