వరల్డ్ కప్ మ్యాచ్ కు వరుణుడి అడ్డు

Update: 2019-06-04 12:19 GMT

వర్షం కారణంగా ప్రపంచకప్ లో ఈ రోజు జరుగుతున్నశ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ నిలిచింది. 33  ఓవర్లు పూర్తయ్యాకా వర్షం కురవడం తో మ్యాచ్ నిలిచిపోయింది. టాస్ గెలిచి శ్రీలంక కు బ్యాటింగ్ అప్పచెప్పిన ఆఫ్ఘనిస్తాన్ తన పదునైన బౌలింగ్, ఫీల్డింగ్ లతో శ్రీలంకను కట్టడి చేసింది. మొదటి పది ఓవర్లపాటు విజృంభించి ఆడిన లంకేయులు కనీసం 200 పరుగులు కూడా చేస్తారా అనే విధంగా వరుసగా అవుట్ చేశారు అప్చఘనిస్తాన్ బౌలర్లు. ఆ జట్టులో నబి తొమ్మిది ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లను తీశాడు. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి శ్రీలంక 33 ఓవర్లకు.. 8 వికెట్లు కోల్పోయి, 182 పరుగులు చేసింది. 

Tags:    

Similar News