నిజాలు చెప్పడమే నేను చేసిన పెద్ద తప్పు : యూనిస్ ఖాన్

పాకిస్థాన్ జట్టుకు ఇప్పటివరకు చాలా మంది కెప్టెన్సీగా వ్యవహరించారు.

Update: 2020-05-25 07:38 GMT
younis khan (File Photo)

పాకిస్థాన్ జట్టుకు ఇప్పటివరకు చాలా మంది కెప్టెన్సీగా వ్యవహరించారు. కానీ కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అందులో ప్రముఖంగా చెప్పాల్సిన పేరు యూనిస్ ఖాన్.. జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో విజయాలను కట్టబెట్టాడు. అంతేకాకుండా ఇతనే సారధ్యంలోనే పాక్ జట్టు తొలిసారిగా 2009లో టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. అయితే ఈ టోర్నీ గెలిచిన ఆరు నెలల తరువాతే యూనిస్ ఖాన్ ని జట్టు నుంచి కెప్టెన్ గా తప్పించింది పాకిస్థాన్ క్రిక్రెట్ బోర్డు..అయితే అందుకు గల కారణం ఇదే అంటూ తాజాగా యూనిస్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

నిజాలు మాట్లాడితే జీవితంలో ఎదురు దెబ్బలు సహజమే అని తెలిసిందే కదా.. నేను చేసిన పెద్ద తప్పు అదే అంటూ వాపోయాడు.... జట్టులోని కొంత మంది క్రికెటర్లు పాక్ తరఫున నిజాయతీగా మ్యాచ్‌లు ఆడటం లేదని చెప్పడమే. అప్పట్లో జట్టులోని రాజకీయాల కారణంగా కొంత మంది ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే ఔటైపోయేవారు. నేను ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ క్రికెటర్లు నాతో కలిసి మ్యాచ్‌లు ఆడారు. అయితే.. వారు చేసిన తప్పునకి ఆ తర్వాత పశ్చాతాపం వ్యక్తం చేశారు. నిజాలు చెప్పడం, నిజాయతీగా ఉండటాన్ని నా తండ్రి నుంచి నేను నేర్చుకున్నానని యూనిస్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

ఇక యూనిస్ ఖాన్ పాక్ జట్టు తరపున టెస్టుల్లో 10,099 పరుగులు, వన్డేల్లో 7249 పరుగులు చేశాడు. మొత్తంగా.. 41 సెంచరీలు చేశాడు.. ఆ తర్వాత 2017లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.


Tags:    

Similar News