గెలిచినా లేదా 'డ్రా' చేసుకున్నా ఆస్ట్రేలియా గడ్డపై

Update: 2019-01-03 01:46 GMT

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (9) అవుట్ అయ్యాడు. విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), అజింక్య రహానే(వైస్‌ కెప్టెన్‌), ఛతేశ్వర్‌ పుజారా, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, జస్ప్రిత్‌ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌ తుది జట్టులో స్థానం సంపాదించారు.

ప్రస్తుతం భారత్ స్కోర్ 24 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 69 పరుగులు. మయాంక్ అగర్వాల్(42*), చటేశ్వర్ పూజారా(16*) క్రీజులో ఉన్నారు. ఇక నాలుగో టెస్టులో టీమిండియాగెలిచినా లేదా 'డ్రా' చేసుకున్నా ఆస్ట్రేలియా గడ్డపై తొలి సిరీస్‌ విజయమవుతుంది. స్వదేశంలో టీమిండియా చేతిలో సిరీస్‌ కోల్పోయిన మొదటి ఆసీస్‌ కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ ఖాతాలో రికార్డు నమోదవుతోంది. ఒకవేళ భారత్ ఓడితే మాత్రం సిరీస్ సమం అవుతుంది.   

Similar News