మిల్లర్ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

Update: 2019-06-05 12:05 GMT

వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ తమ టీమ్ ను మిల్లర్, ఫెలుక్‌వాయో ఆదుకున్నారు. మెల్లగా ఒక్కో పరుగు చేస్తూ మరో వికెట్ పడకుండా కాపాడారు. ఈ జోడీని విడదీయడానికి బుమ్రా ను మరో మారు ప్రయోగించాడు కోహ్లీయే. అయినా ఫలితం కనబడలేదు. తరువాత భువిని రంగం లోకి దించాడు. పరుగుల వేగాన్ని నిరోధించగలిగారు కానీ.. వికెట్ తీయలేకపోయారు. అయితే, 36 వ ఓవర్లో చాహల్ మళ్ళీ విజృంభించాడు. ప్రమాదకరంగా ఆడుతున్న మిల్లర్ ను కేచ్ అండ్ బౌల్డ్ గా వెనక్కి పంపాడు. దీంతో దక్షిణాఫ్రికా మరో మారు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇదే కొనసాగితే 150 పరుగులూ కష్టమే ఆ జట్టుకి. ప్రస్తుతం 36 ఓవర్లలో ఆరు వికెట్లకి 138 పరుగులు మాత్రమే చేసింది. 



Tags:    

Similar News