ఐపీఎల్ 2019 ఉత్కంఠ భరితమైన ముగింపు ఇచ్చింది. క్రికెట్ అభిమానులకు పసందైన విందును అందించింది. 8 జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లు.. 50 రోజుల పాటు నరాలు తెంచిన ఉత్కంఠ.. మొత్తంగా 59 మ్యాచ్‌ల ఐపీఎల్ 12వ సీజన్.. హోరా హోరా గా సాగిన లీగ్ మ్యాచులు.. ప్రతిష్టాత్మకంగా ముగిసిన ప్లేఆఫ్ మ్యాచులు.. అంతకు మించి వినోదాన్ని.. ఉల్లాసాన్ని.. ఉత్కంఠ ను అందించిన ఫైనల్ మ్యాచ్.. ఇలా ఐపీఎల్ లో ప్రతి అంశమూ అభిమానులను అలరించింది. అయితే, దీనికోసం ఇంత కష్టపడి ఆడిన క్రికెటర్లకు.. జట్లకు ఎంత దక్కిందో తెలుసుకోవాలనుందా.. ఇవిగో ఆ వివరాలు..
గెలిచిన జట్టుకు మాత్రమే కాదు.. వివిధ రకాలుగా వ్యక్తిగత ప్రతిభ చూపించిన ఆటగాళ్లకు కూడా నగదు బహుమతులు దక్కాయి.
విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్‌కు ప్రైజ్ మనీగా రూ.20కోట్లు గెలుచుకుంది. రన్నరప్‌గా నిలిచిన చెన్నైకి రూ.12.50 కోట్లు ప్రైజ్ మనీ లభించింది.
- పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు) : ఇమ్రాన్ తాహీర్(చెన్నై సూపర్ కింగ్స్) రూ.10లక్షలు
- ఆరెంజ్ క్యాప్(అత్యధిక పరుగులు) : డేవిడ్ వార్నర్(సన్‌రైజర్స్ హైదరాబాద్), రూ.10లక్షలు
- అత్యధిక విలువైన ఆటగాడు : ఆండ్రి రసెల్(కోల్‌కతా నైట్ రైడర్స్). హారియర్ కారుతో పాటు రూ.10లక్షలు చెక్కు.
- సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ : ఆండ్రి రసెల్(కోల్‌కతా నైట్ రైడర్స్), రూ.10లక్షలు.
- రాహుల్ చాహర్, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ : రూ.10లక్షలు.
- కేఎల్ రాహుల్, స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, రూ.10లక్షలు.
- హార్దిక్ పాండ్య, అత్యంత వేగవంతమైన అర్ధశతకం. రూ. 10లక్షలు.
- శుభ్‌మన్ గిల్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. రూ.10లక్షలు
- కీరన్ పొలార్డ్, పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్, రూ.10లక్షలు.
అన్నట్టు ఉత్తమ పిచ్, మైదానం కేటగిరీ లో హైదరాబాద్, మొహాలి(పంజాబ్) రెండు మైదానాలకు సంయుక్తంగా అవార్డు దక్కింది.