రహానే సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా!

Update: 2019-10-20 06:00 GMT

సౌతాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రహానే అద్భుత సెంచరీ సాధించాడు. ఆదివారం ఓవర్నైట్ స్కోర్ 83 పరుగుల నుంచి బ్యాటింగ్ ప్రారంభించిన రహానే ఆట ప్రారంభమైన కొద్ది సేపట్లోనే తన టెస్ట్ కెరీర్ లో 11 వ సెంచరీని సాధించాడు. ౧169 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో రహానే సెంచరీ చేరుకున్నాడు. తొలి రోజైన శనివారం వరుసగా.. త్వర త్వరగా మూడు వికెట్లు చేజార్చుకుని ఇబ్బందుల్లో ఉన్న టీమిండియాను రోహిత్ శర్మ తో కలసి రహానే ఆదుకున్నాడు. ఇప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ కు చక్కని సహకారం అందిస్తూ తను కూడా సెంచరీ మార్క్ అందుకున్నాడు.

ఇదే క్రమంలో వేగంగా ఆడిన రహానే మరో 15 పరుగులు జత చేసి ఔటయ్యాడు. మొత్తమ్మీద 115 పరుగులు చేసిన రహానే లిండే బౌలింగ్ లో క్లాసిల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ప్రస్తుతం భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. రోహిత్ శర్మ తన డబుల్ సెంచరీకి 9 పరుగుల దూరంలో ఉన్నాడు. అతనికి సహాయంగా జడేజా 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు.


Tags:    

Similar News