జారవిడిచారో.. ఇక చుక్కలు కనిపిస్తాయి!

Update: 2019-07-03 02:49 GMT

క్రికెట్ లో లైఫ్ దొరకటం చాలా గొప్పగా భావిస్తారు. ఎవరన్నా బంతి గాల్లోకి లేపితే.. దానిని అవతలి ఫీల్డర్ నేలపాలు చేస్తే ఆ జీవనదానంతో బ్యాట్స్ మెన్ అలెర్ట్ అయిపోతాడు. అటువంటి చెత్త షాట్ లు ఆడకుండా తనని తానూ సంబాలించుకుంటాడు. అయితే, అన్నిసార్లూ అలా జరగాలనేం లేదు. కనీ, టీమిండియా ఓపెనర్.. రోహిట్ అలా కాదు. ఒక్కసారి పొరపాటున అతని క్యాచ్ ప్రత్యర్థులు వదిలేశారా.. ఇంక అవతలి బౌలర్లకు చెమటలు పట్టడం ఖాయం. ఆ ఏదో ఒకసారి అలా ఆడగలరు కానీ అన్నిసార్లూ సాధ్యం కాదులెండి అనుకోవద్దు.. ఈ ప్రపంచ కప్ లో 8 మ్యాచ్ లలో 544 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఈ నాలుగు సందర్భాల్లోనూ రోహిత్ కు జీవనదానం దొరకడం విశేషం. ప్రత్యర్థుల ఏమరపాటును పూర్తిస్థాయిలో వినియోగించుకుని పరుగుల పంట పండించుకున్నాడు. కావాలంటే ఈ వివరాలు చూడండి మీరే ఒప్పుకుంటారు రోహిత్ ను వదిలేశారా.. బౌలర్లకు చుక్కలే అని!

- దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఒక పరుగు వద్ద క్యాచ్‌ విడిచిపెట్టడంతో రోహిత్‌ అజేయ సెంచరీ (122 నాటౌట్‌)తో చెలరేగాడు.

- ఆస్ట్రేలియాతో పోరులో 2 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడి అర్ధ సెంచరీ (57) సాధించాడు.

- ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 4 పరుగుల వద్ద రోహిత్‌ క్యాచ్‌ను వదిలేయగా.. అతడు సెంచరీ (102) సాధించాడు.

- మంగళవారం బంగ్లాదేశ్‌తో పోరులోనూ 9 పరుగుల వద్ద ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో రోహిత్‌ అందించిన క్యాచ్‌ను తమీమ్‌ విడిచిపెట్టాడు. ఫలితం.. రోహిత్‌ మరో సెంచరీ (104).

Tags:    

Similar News