ఐపీఎల్‌లో రాణిస్తే.. వరల్డ్‌కప్‌ బెర్తు ఖాయం

Update: 2019-03-16 09:43 GMT

ఐపీఎల్‌లో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగానే వరల్డ్‌కప్‌ జట్టు ఎంపిక ఉండదనేది గత కొన్ని రోజుల క్రితం ఎంఎస్‌కే ప్రసాద్‌, విరాట్‌ కోహ్లిలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే రానున్న వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఆసీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ జట్టు ఆశించిన స్థాయిలో దూకుడు ప్రదర్శించలేదు. స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌ను కూడా భారత్ జట్టు కోల్పోయింది. ఇక ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అజింక్యా రహానే రానున్న వరల్డ్‌కప్‌ బెర్తుపై ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే వరల్డ్‌కప్‌లో తన బెర్తుపై ఎలాంటి స్పష్టత లేనేలేదు కాగా ఐపీఎల్ మ్యాచ్‌లో తనదైనా శైలీలో రాణించి వరల్డ్‌కప్‌ బెర్తును కొట్టేస్తానంటున్నాడు అజింక్యా రహానే. అయితే వరల్డ్‌కప్‌ పై పెద్దగా ఆలోచించడంలేదని ఏ టోర్నీ ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు. మనం ఆడుతున్న మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపించడంపై దృష్టి సారించాలని రహేనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన ముందున్న ఓకే ఒక్క అవకాశం ఐపీఎల్ అని అన్నాడు. 

Similar News