అదే నిలకడతో ఇంగ్లాండ్ : ప్రస్తుత స్కోరు 221 / 4 (35 ఓవర్లలో)

Update: 2019-06-03 16:25 GMT

వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ లక్ష్యఛేదనలో ఎక్కడా తొణక్కుండా నిదానంగా ఆడుతోంది. జట్టు స్కోరు 120 వద్ద బెన్ స్టోక్స్  వికెట్ ను కోల్పోయిన తరువాత క్రీజులోకి వచ్చిన బట్లర్ తో కలిసి రూట్ ఇన్నింగ్స్ ను సరి చేశాడు.. క్రీజులో కుదురుకున్న రూట్స్ కు తోడుగా బట్లర్ చెలరేగిపోయాడు. ఈ క్రమంలో వీరిద్దరూ ఏభై పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 31ఓవర్‌ చివరి బంతికి భారీ సిక్సర్‌తో బట్లర్‌(52) అర్ధశతకం చేరుకున్నాడు. 31 ఓవర్లో ఇంగ్లాండ్ స్కోరు 200 దాటింది. ప్రస్తుతం 35 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 221  పరుగులు చేసింది ఇంగ్లాండ్. 


Tags:    

Similar News