పరుగుల వేటలో రికార్డుల మోత!

Update: 2019-06-18 13:00 GMT

ఇయాన్ మోర్గాన్ ఆఫ్ఘాన్ బౌలర్లను ఉతికి 'ఆరే'శాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 17 సిక్సర్లు బాదేశాడు. విండీస్ బ్యాట్స్ మాన్  క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒక ఇన్నింగ్స్ లో 16 సిక్సర్ల రికార్డు బద్దలు కొట్టాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి  397 పరుగులు చేసింది. ఆఫ్ఘానిస్తాన్ తో జరుగుతున్నవరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు కళ్ళు చెదిరే బ్యాటింగ్ చేసింది. నాలుగు వందలకు దగ్గరగా పరుగులు చేసింది. 

పరుగుల సునామీ.. బ్యాటింగ్ విన్యాసం.. విధ్వంశం.. ఇలా ఏ పదాన్ని తీసుకున్న తక్కువే మోర్గాన్ బ్యాటింగ్ గురించి చెప్పటానికి వరుసగా ఉతుకుడు.. అతి తక్కువ బంతుల్లోనే ప్రపంచ కప్ లో సెంచరీ చేసిన బ్యాట్స్ మాన్గా రికార్డు సృష్టించాడు. 

మోర్గాన్ ధాటికి ఆఫ్ఘన్ బౌలర్లు కకావికలం అయ్యారు. మొత్తమ్మీద ఈ వరల్డ్ కప్ లో తొలిసారి విధ్వంశకర బ్యాటింగ్ విన్యాసాల్ని చూపించి.. ప్రపంచ కప్ ఫేవరేట్ స్థానానికి ఎందుకు తమను అనుకుంటున్నారో చూపించారు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్. ఇపుడు ఆఫ్ఘన్ విజయ లక్ష్యం 398 పరుగులు.

Tags:    

Similar News