టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌లో మార్పుల్లేవ్: సీఏ స్పష్టం

అక్టోబరు- నవంబరు నాటికి ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని మేము నిజంగా ఆశిస్తున్నాము.

Update: 2020-03-17 12:47 GMT
T20 World Cup 2020

కరోనా ప్రభావం వలన ఇప్పటికే పలు అంతర్జాతీయ క్రికెట్ టోర్నీలు రద్దు అయిన సంగతి తెలిసిందే.. ఇక ఐపీఎల్ 2020 సీజన్ వాయిదా కూడా పడింది. ఇక ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్ కూడా రద్దు అవుతుందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు ఉండబోవని, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే టీ20 వరల్డ్‌కప్ జరుగుతుందని స్పష్టం చేసింది.

" అక్టోబరు- నవంబరు నాటికి ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని మేము నిజంగా ఆశిస్తున్నాము. ఒకవేళ అదే జరిగితే..? షెడ్యూల్ ప్రకారం టీ20 వరల్డ్‌కప్ జరగడం ఖాయం. మెల్‌బోర్న్ వేదికగా నవంబరు 15న టోర్నీ ఫైనల్ జరగనుండగా.. ఆ మ్యాచ్‌కి స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయేలా ప్లాన్ చేస్తున్నాం" అని సీఏ చీఫ్ కెవిన్ రాబర్ట్స్ వెల్లడించాడు.

ఇక గత వారం, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్ తర్వాత రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.. 

Tags:    

Similar News