బంగ్లాదేశ్ నిదానంగా...

Update: 2019-06-02 10:40 GMT

ప్రపంచ కప్ క్రికెట్ లో భాగంగా ఈరోజు దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లమధ్య పోరు మొదలైంది. టోర్నీ లో తన రెండో మ్యాచ్ ఆడుతున్న సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలిమ్యాచ్ లో ఇంగ్లాండ్ మీద పరాజయం పాలైన సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఇక టోర్నీలో తోలి మ్యాచ్ ను గెలుచుకుని ఆత్మవిశ్వాశం తో ముందడుగు వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. 

సౌతాఫ్రికా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదటి నాలుగు ఓవర్లు బంగ్లా ఓపెనర్లు సౌమ్య సర్కార్‌ , తమీమ్‌ ఇక్బాల్‌ ఆచి, తూచి ఆడారు. ఐదో ఓవర్లో వేగాన్ని పెంచడానికి ప్రయత్నించారు. తరువాత మళ్ళీ నిలకడగా అది ఎదో ఓవర్ కు జట్టు స్కోరు 50 దాటించారు. జాగ్రత్తగా ఆడుతూ చెత్త బంతులను బౌండరీలు దాటిస్తూ ఆడుతున్న బంగ్లా టీమ్ కు తొమ్మిదో ఓవర్లో తోలి దెబ్బ తగిలింది. ఫెలుక్వాయో వేసిన 9వ ఓవర్‌ రెండో బంతికి తమిమ్ ఇక్బాల్‌(16; 29 బంతుల్లో) కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తరువాత సౌమ్య సర్కారుకు షకీబ్‌ అల్‌ హసన్‌ తోడవడంతో దూకుడుగా ఆడాడు. అయితే పన్నెండో ఓవర్లో క్రిస్‌మోరిస్‌ వేసిన 4వ banthiki దూకుడుగా ఆడుతున్న సౌమ్య సర్కార్‌ (42;30 బంతుల్లో) కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో వెనుతిరిగాడు. స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోవడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ నిలకడగా ఆడుతున్నారు.

ప్రస్తుతం 17 ఓవర్ ముగిసే సరికి షకీబ్‌ అల్‌ హసన్‌ 27(27), ముష్ఫికర్‌ 11(15)  వికెట్‌ పడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తున్నారు. దీంతో బంగ్లా 17 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది.


Similar News