నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

Update: 2019-06-06 12:20 GMT

వరల్డ్ కప్ టోర్నీలో పదో మ్యాచ్ లో ఆసీస్, విండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పచెప్పిన విండీస్.. బౌలింగ్ లో చక్కని ప్రదర్శన చేస్తోంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి అవస్థలు పడుతున్నారు. త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్ తన సహచరుడు స్టోయినిస్‌(19) తో కలసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 17 వ ఓవర్లో స్టోయినిస్‌ అవుట్ కావడంతో కారే స్మిత్ తో జత కూడాడు. అయితే, వస్తూ వస్తూనే కారే ఎల్బీగా ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. విండీస్ సమీక్ష కోరినా ఫలితం ఆసీస్‌కే అనుకూలంగా వచ్చింది. ఆ తరువాత నుంచి ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ విండీస్ బౌలర్లను నిలువరించే ప్రయత్నం చేశారు.

కారేతో కలిసి స్టీవ్‌ స్మిత్‌ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ జోడీ 27ఓవర్లో అర్థశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చక్కటి సమన్వయంతో స్మిత్‌- కారే జోడీ ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అనవసరపు షాట్లకు పోకుండా వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాదిస్తూ వచ్చారు. ముఖ్యంగా కారే విండీస్‌ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. అయితే చక్కగా కుదురుకున్న కారే-స్మిత్‌ జోడీని మొత్తానికి రసెల్‌ చక్కని బంతితో విడదీశాడు. 31ఓవర్‌లో నాలుగో బంతిని ఆడిన కారే(45; 55బంతుల్లో) వికెట్‌కీపర్‌ షైహోప్‌ చేతికి చిక్కాడు. ఆసీస్‌ 35 ఓవర్లకు 175/6తో ఉంది. స్మిత్‌ (47), కౌల్టర్‌ నైల్‌ (21) ఆచితూచి ఆడుతున్నారు. 

Tags:    

Similar News