ఆసీస్, ఆచి తూచి..

Update: 2019-06-09 14:40 GMT

భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఆసీస్ ఆటగాళ్లు నిదానంగా ఆడుతున్నారు. తొలి పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. మూడు ఓవర్లు బౌలింగ్ తరువాత బుమ్రాను ఆపి, పంద్యాను బౌలింగ్ కు తీసుకువచ్చింది టీమిండియా. భువనేశ్వర్, పాండ్య జాగ్రత్తగా బౌలింగ్ చేశారు కనీ, పదో ఓవర్ లో పాండ్య వేసిన బంతుల్ని సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా బౌన్దరీలినేలు దాటించాడు ఫించ్. దీనితో పది ఓవర్లకు 48 పరుగులు సాధించగలిగింది ఆస్ట్రేలియా. ఫిన్చ్ 26 బంతుల్లో 28 పరుగులు, వార్నర్ 34 బంతుల్లో 14 పరుగులూ చేసి క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శతకంతో రాణించిన భారత బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ధావన్‌ ఫీల్డింగ్‌కు రాలేదు. బ్యాటింగ్‌ చేస్తుండగా చేతికి దెబ్బ తగలడంతో ప్రస్తుతానికి డ్రెసింగ్‌ రూమ్‌కు పరిమితమయ్యాడు. అతని స్థానంలో రవీంద్ర జడేజా ఫీల్డింగ్‌ చేస్తున్నాడు.

Tags:    

Similar News