శ్రీకాకుళంలో 'ఏరో స్పోర్ట్స్ ఫెస్టివల్‌' ఘనంగా ప్రారంభం

Update: 2019-01-13 15:00 GMT

ఏరో స్పోర్ట్స్ ఫెస్టివల్ కు విశేష ఆదరణ లభిస్తోంది. సీతంపేట ITDA పరిధిలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అడ్వెంచర్ పార్క్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండగా..ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఏరో స్పోర్ట్స్ ఫెస్టివల్ పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది.

శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీ ప్రాంతం అద్భుత వేడుకకు వేదికగా మారింది. మూడురోజుల పాటు జరిగే ఏరో స్పోర్ట్స్ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏరో స్పోర్ట్స్ ఉత్సవాల్లో ఆరు పారామోటరింగ్ సాధనాలు , ఒక పవర్ హాంగ్ గ్లైడింగ్ , రెండు హాట్ ఎయిర్ బెలూన్ లు , రిమోట్ కంట్రోల్ ఫ్లయింగ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

ఏరో స్పోర్ట్స్ ఉత్సవాల్లో భాగంగా సీతం పేట ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకులు పారా మోటార్, ఫ్లైయింగ్ చేయుటకు అధికారులు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. పండుగ సందర్భంలో కనువిందు చేసే ఫ్లయింగ్ క్రీడలను వీక్షిస్తున్న పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏరో స్పోర్ట్స్ ఉత్సవాల కోసం ITDA అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.  

Similar News