అఫ్గానిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం (62 బంతుల్లో 162 నాటౌట్; 11 ఫోర్లు, 16 సిక్స్‌లు) తో క్రికెట్ చరిత్రలోనే సంచలనం సృష్టించాడు. ఈ రికార్డుకు ఐర్లాండ్ బౌలర్లను బలయ్యారు. ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా విజృంభించాడు. అఫ్గానిస్తాన్ , ఐర్లాండ్ జట్ల మధ్య శనివారం జరిగిన రెండో టి20లో అఫ్గానిస్తాన్ టి20 చరిత్రలోనే రికార్డు భారీ స్కోర్ చేసింది. ఆఫ్ఘన్ ఆటగాడు హజ్రతుల్లా వీర విజృంభణకు తోడు ఉస్మాన్ ఘని (48 బంతుల్లో 73; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో అఫ్గానిస్తాన్ మూడు వికెట్లకు 278 పరుగులు సాధించింది. అద్భుతం జరిగితే తప్ప ఛేదించలేనంత స్కోరుతో బరిలో దిగిన ఐర్లాండ్... ఓపెనర్, కెప్టెన్ స్టిర్లింగ్ (50 బంతుల్లో 91; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేయడంతో ఐర్లాండ్ కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేసినా.. ఆరు వికెట్లకు 194 పరుగులు చేసి 84 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.