చైనా పద్దతిలో మన థియేటర్లు..?

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభించడంతో దానిని అరికట్టడంలో భాగంగా చిత్ర పరిశ్రమలో థియేటర్లను మూసివేశారు.

Update: 2020-04-03 06:19 GMT

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభించడంతో దానిని అరికట్టడంలో భాగంగా చిత్ర పరిశ్రమలో థియేటర్లను మూసివేశారు. షూటింగులు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు థియేటర్లన్నీ ఎప్పుడు తెరుస్తారు? అన్నది సగటు అభిమాని ప్రశ్న.. ఏప్రిల్ లో అయితే తెరుచుకునే ఆస్కారం అయితే లేదనే చెప్పాలి. ఇక అన్ని అనుకూలిస్తే మేలో తెరుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం. అయితే అలా తెరుచుకున్న థియేటర్లలలో చైనా పద్దతులను అవలభింస్తారు అన్న చర్చ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ..

అంటే సీట్ల కెపాసిటీ తగ్గించడం అన్నమాట... అంటే ఓ వెయ్యి మంది కూర్చునే కెపాసిటీ లో 250 టికెట్లు అమ్మడం అన్నమాట.. మనిషి మనిషికి మధ్య మూడు సీట్లు ఖాళీ ఉంటాయి అన్నమాట.. ఇలాంటి కండిషన్స్ పెట్టీ చైనాలో థియేటర్లకి అనుమతి ఇచ్చారని తెలుస్తోంది.. అలాగే ఇక్కడ కూడా అమలు చేయనున్నారని తెలుస్తోంది..ఒకవేళ ధియేటర్లు తెరుచుకున్నప్పటికి పెద్దపెద్ద హీరోల సినిమాలు విడులయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి. చిన్న సినిమాల విడుదలకు మాత్రం మార్గం దొరికినట్టు అవుతోంది.  

Tags:    

Similar News