ఆకట్టుకుంటున్న వెంకీ మామ కొత్త సాంగ్ ..

ఎన్నాళ్లోకో అంటూ సాగే ఈ పాటలో వెంకటేష్‌, పాయల్ రాజ్‌పుత్‌ కలిసి ఆడిపాడారు.ఈ పాటలో వెంకీ డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌లో

Update: 2019-11-16 11:00 GMT
venky mama new song

రియల్ లైఫ్ లో వెంకటేష్, నాగచైతన్య మామాఅల్లుళ్లు అన్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు రీల్ లైఫ్ లో కూడా మామ అల్లుళ్ళుగా కనిపిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న వెంకీ మామ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయినా వెంకీ మామ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంగీత దర్శకుడు తమన్ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసిన మరో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఎన్నాళ్లోకో ఎన్నాళ్లకో అంటూ సాగే ఈ పాటలో వెంకటేష్‌, పాయల్ రాజ్‌పుత్‌ కలిసి ఆడిపాడారు.. ఈ పాటలో వెంకీ డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తూ అదరగొడుతున్నారు. ఇక హీరోయిన్ పాయల రాజ్‌పుత్‌ తన అందాలతో కవ్విస్తుంది. ఈ పాటని శ్రీమణి రాయగా పృద్వీ చంద్ర ఆలపించారు. ఇక ఇందులో నాగచైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తుంది. దర్శకుడు బాబీ చాలా కాలం గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. దీనిని సురేష్ ప్రొడక్షన్ నిర్మిస్తుంది. ఈ సినిమాని మొదటగా సంక్రాంతి బరిలో దించాలని అనుకున్నారు . కానీ భారీ సినిమాలు లైన్ లో ఉండడంతో డిసెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. 

Full View

Tags:    

Similar News