త్వరలో పెళ్లి చేసుకోబోతున్న హీరో

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో విశాల్ కూడా ఒకడు. తమిళ్ లోనే కాక తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్. ఈ 41 ఏళ్ల హీరో పెళ్లి కోసం అతని కుటుంబ సభ్యులు మాత్రమే కాక ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Update: 2018-12-31 08:28 GMT
hero Vishal

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో విశాల్ కూడా ఒకడు. తమిళ్ లోనే కాక తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్. ఈ 41 ఏళ్ల హీరో పెళ్లి కోసం అతని కుటుంబ సభ్యులు మాత్రమే కాక ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొంతకాలంగా శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతో విశాల్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని కొందరు చెవులు కొరుక్కున్నారు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆ వార్తలకు ముగింపు పలుకుతూ విశాల్ వాళ్ల నాన్న, నిర్మాత జీకే రెడ్డి షాకింగ్ వార్తను బయటపెట్టారు.

ఒక తమిళ డైలీ తో ఈ మధ్యనే ఇంటరాక్ట్ అయిన ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి తన కొడుకు విశాల్ పెళ్లి పై స్పందించారు. త్వరలో విశాల్ కు అనిషా అనే ఒకమ్మాయి తో నిశ్చితార్థం జరగనుందని స్పష్టం చేశారు. అనిషా హైదరాబాద్ కి చెందిన అమ్మాయి కావడం విశేషం. ఆమె ఒక బిజినెస్ మాన్ కూతురు అని సమాచారం. ఇప్పటి వరకు పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా నడిగర్ సంఘం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకు తన పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పే వాడు విశాల్. ఇక ఇప్పటికే కన్స్ట్రక్షన్ మొదలైన ఆ బిల్డింగ్ మార్చి లేదా ఏప్రిల్లో పూర్తి కానుంది. కాబట్టి త్వరలో విశాల్ కు పెళ్లి బజంత్రీలు మ్రోగనున్నాయి.

Similar News