చిరు, కొరటాల సినిమాలో విజయశాంతి?

Update: 2019-09-26 10:39 GMT

లేడి అమితాబ్ గా తెలుగు తెర పై పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ విజయశాంతి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత మొఖానికి మేకప్ వేసుకొని ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్నారు విజయశాంతి. ప్రస్తుతం అనిల్ రావిపూడి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నికేవ్వరు సినిమాలో విజయశాంతి ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె కొరటాల శివ సినిమాలో నటించనున్నారని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది.

ప్రస్తుతం కొరటాల చిరంజీవితో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం కొరటాల విజయశాంతిని సంప్రదించారట. అయితే ఆ పాత్ర చేయడానికి  విజయశాంతి కూడా సుముఖత వ్యక్తం చేసారని టాక్ నడుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం చిరు సైరా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. సినిమాని అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

Tags:    

Similar News