చిరంజీవి స్నేహితుడు..అల్లు అర్జున్ శత్రువుగా..!

Update: 2019-11-02 11:17 GMT
vijay sethupathi

ఈ ఏడాది సైరా సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులని మెప్పించాడు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి... రాజపాండి పాత్రలో సైరా నరసింహరెడ్డికి నమ్మే ఆప్తుడుగా విజయ్ సేతుపతి కనిపించారు. ఆ పాత్రకి విజయ్ సేతుపతికి మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజగా అయన అల్లు అర్జున్ కొత్త సినిమాలో విలన్ గా నటించనున్నాడు అని తెలుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటివలే సినిమాకి సంబంధించిన ముహూర్తపు షాట్ కూడా జరిగింది. అంతే కాకుండా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఉప్పెన సినిమాలో కూడా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడని సమాచారం.. ఒక వైపు తమిళ్ లో హీరోగా ఇటు తెలుగులో విలన్ గా బాగానే అవకశాలు అందుకుంటున్నాడు విజయ్..

Tags:    

Similar News