కాకినాడ అమ్మాయితో పెళ్లి ఓకే అంటున్న రౌడి హీరో

వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో విజయ్ దేవరకొండ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. 'నోటా' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, 'టాక్సీ వాలా' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ రౌడీ బాయ్.

Update: 2018-12-29 06:36 GMT
Vijay Deverakonda

వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో విజయ్ దేవరకొండ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయాడు. 'నోటా' సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, 'టాక్సీ వాలా' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఈ రౌడీ బాయ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతుల్లో చాలానే మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టు లో చేరిపోయిన విజయ్ దేవరకొండ పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. కాకినాడ అమ్మాయిల లో ఎవరైనా నచ్చితే పెళ్లి చేసుకోవడానికి రెడీ అని అంటున్నాడు ఈ 'అర్జున్ రెడ్డి' హీరో.

"నాకు బాక్గ్రౌండ్ తో పని లేదు. ఇక్కడ ఎవరైనా నచ్చితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను" అని అంటున్న విజయ్ దేవరకొండ పెళ్లికి ఇంకా చాలా టైముంది అని కూడా చెబుతున్నాడు. 'డియర్ కామ్రేడ్స్' షూటింగ్ కోసం కాకినాడ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని షూటింగ్ చాలా సరదాగా జరుగుతోందని అంటున్నాడు అలానే కాకినాడ లోకల్ స్టూడెంట్లు కూడా షూటింగులో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చాడు. 'గీతగోవిందం' హీరోయిన్ రష్మిక మందన్న 'డియర్ కామ్రేడ్' సినిమాలో కూడా విజయ్ తో రొమాన్స్ చేయనుందని తెలిసిన విషయమే.

Similar News