మరో బ్లాక్ బస్టర్ కి రెడీ అయిపోయిన విజయ్

వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు హీరో విజయ్ దేవరకొండ .. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర‌‌్శకత్వంలో " వరల్డ్ ఫేమస్ లవర్ " సినిమాని

Update: 2019-12-18 10:13 GMT
Vijay devarakonda

వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు హీరో విజయ్ దేవరకొండ .. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర‌‌్శకత్వంలో " వరల్డ్ ఫేమస్ లవర్ " సినిమాని చేస్తున్నాడు. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాని మొదలు పెట్టాడు. ఇప్పుడు మరో సినిమాని ఒకే చేశాడు విజయ్.. నిన్ను కోరి, మజిలి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచుకున్నా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు విజయ్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని అనౌన్సు చేశారు.

ఇది విజయ్ 12 వ సినిమా.. ఈ సందర్భంగా విజయ్ దిల్ రాజుకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ రాజు సార్.. బ్లాక్ బస్టర్ హిట్టు లోడింగ్ మీ పై ప్రేమ, గౌరవం ఉన్నాయని విజయ్ ట్వీట్ చేశాడు. సినిమాలోని నటినటులను, సాంకేతిక నిపుణులను త్వరలో వెల్లడించనున్నారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమా చేస్తుండడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం విజయ్ చేస్తున్న " వరల్డ్ ఫేమస్ లవర్ " ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర‌‌్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కే. యస్ వల్లభ నిర్మిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. 




 


Tags:    

Similar News