బాలీవుడ్ లోకి విజయ్ ఎంట్రీ ?

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత వచ్చిన

Update: 2019-12-10 12:46 GMT
Vijay devarakonda (file photo)

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి, 'గీతా గోవిందం', 'టాక్సీవాలా' సినిమాలు వరుసగా హిట్టు కావడంతో విజయ్ రేంజ్ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్ సినిమాలు తమిళ్, తెలుగు భాషలలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయనే చెప్పాలి.

ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీనిని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని బాలీవుడ్ లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఫైటర్ సినిమాను బాలీవుడ్ లో కూడా విడుదల చేసేందుకు నిర్మాత కమ్ దర్శకుడు పూరి జగన్నాధ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు బాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కరణ్ జోహార్ తో చర్చలు జరిపారని సమాచారం. చర్చలు దాదాపు ఒకే అయ్యాయని, ఫైటర్ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ పక్కా అని తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

బహుబలి సినిమాని కరణ్ జోహార్ చాలా గొప్పగా ప్రమోట్ చేశారు. అక్కడ ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొని భారీ వసూళ్ళని సాధించిపెట్టింది. ఇప్పుడు అదే స్టైల్ లో ఈ సినిమాని కూడా కరణ్ జోహార్ ప్రమోట్ చేసేందుకు అన్ని సిద్దం చేశారని తెలుస్తుంది. ఈ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చును కూడా కరణ్ జోహారే అందిస్తున్నారట. అయితే సినిమా స్క్రిప్ట్ ను బాలీవుడ్ కూడా ట్యూన్ అయ్యే విధంగా చేసే బాద్యత మాత్రం పూరి జగన్నాదే తీసుకున్నారట. నటినటులలో మార్పులు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్టు కొట్టిన పూరి మళ్ళీ బ్యాక్ అనిపించుకున్నాడు. ఇక మంచి హిట్లతో దూసుకుపోతున్న విజయ్ తో పూరి ఇప్పుడు సినిమా చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఛార్మి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  

Tags:    

Similar News