తెరపైకి మరో అర్జున్ రెడ్డి...

Update: 2019-10-14 12:47 GMT

సందీప్ వంగ దర్శకతంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్టయిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా విజయ్ దేవరకొండని స్టార్ ని చేసేసింది. ఆ సినిమాలో అతను చేసిన నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇదే సినిమాని సందీప్ హిందీలో 'కబీర్ సింగ్' టైటిల్ తో తెరకెక్కించాడు. అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా .. అయితే ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ తిరిగి పని చేయనుంది. ప్రస్తుతం సందీప్ ఓ హిందీ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ త్వరలో మా కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం హిందీలో చేస్తున్న సినిమా తర్వాత విజయ్ తో సినిమా ఉంటుందని అందరు అనుకుంటున్నారు. ఇక విజయ్ ప్రసుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దీని తర్వాత పూరి జగన్నాధ్ తో ఓ సినిమాకి కమీట్ అయ్యాడు. 

Tags:    

Similar News