హీరో నిఖిల్ తో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాని చేసిన తర్వాత దర్శకుడు వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం డిస్కోరాజా.. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్నాడు. నభానటేశ్, పాయల్‌రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్. మోషన్ పోస్టర్స్ సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. అయితే ఈ సినిమాలో హీరో అల్లరి నరేష్ నటించాబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. సెకండ్ హాఫ్‌లో అయన పాత్ర కీలకంగా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై డైరెక్టర్ వీఐ ఆనంద్ క్లారిటీ ఇచ్చాడు. డిస్కోరాజాలో అల్లరి నరేశ్ నటించడం లేదని, అవన్నీ అవాస్తవమని అన్నాడు.
ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు . వెన్నెల కిశోర్, సత్య, అజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాబీ సింహా విలన్ గా నటిస్తున్నాడు . సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక అల్లరి నరేష్ విషయానికి వస్తే ఈ సంవత్సరం మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన మహర్షి సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించాడు అల్లరి నరేష్.. ఈ పాత్రకి గాను నరేష్ కి మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం సోలోగా ఓ సినిమా ద్వారా ఓ నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. శతమానం భవతి ఫేం సతీష్ విగ్నేశ ఈ సినిమాకి నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు..