సిద్ధార్థ్ కొత్త సినిమాకి మెగా హీరో ప్రచారం
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు హీరో సిద్ధార్థ్ .
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమాతో తమిళ, తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు హీరో సిద్ధార్థ్ . ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో మంచి హిట్టు కొట్టి లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బొమ్మరిల్లు సినిమా భారీ విజయం సాధించడంతో హీరోగా సిద్ధార్థ్ రేంజ్ పెరిగింది. కానీ ఆ తర్వాత మాత్రం వరుసగా సిద్ధార్థ్ కి ప్లాప్స్ ఎదురయ్యాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్! సినిమాలు పర్వాలేదు అనిపించినా బావ, అనగనగా ఓ ధీరుడు, 180 సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. ఇక తెలుగులో చివరగా సిద్ధార్థ్ కనిపించిన సినిమా 'గృహం'. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.
దీనితో దాదాపుగా హీరో సిద్ధార్థ్ ని తెలుగు ప్రేక్షకులు మరిచిపోయారనే చెప్పాలి. కానీ చాలా రోజుల తర్వాత సిద్ధార్థ్ మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. 'టక్కర్' అనే ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముదుకు వస్తున్నాడు సిద్ధార్థ్ .. ఓ కొత్త తరహ కథతో ఈ సినిమా తెరకేక్కుతుందని సమాచారం. ఈ సినిమాలో సిద్ధార్థ్ కి జోడిగా మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తుంది. అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కార్తిక్ జి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు..
దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాని విడుదల చేయనున్నారు. నివాస్ కె ప్రసన్న ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ కమ్ ఫస్ట్ లుక్‌ను మెగా హీరో వరుణ్ తేజ్ తన అధికార ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మెగా ప్రిన్స్ రూపంలో ఫస్ట్ లుక్‌ను విడుదల కావడం ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమాని ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుధన్ సుందరం, జయరాం నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అయిన తెలుగులో మళ్ళీ సిద్దార్థ్ కం బ్యాక్ అనిపించుకుంటాడా లేదా అన్నది చూడలి మరి.
Presenting you the title poster of @Actor_Siddharth's next #TAKKAR
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 9, 2019
Also starring @itsdivyanshak, @iYogiBabu & @RjVigneshkanth
Directed by @Karthik_G_Krish
Music by @nivaskprasanna
Produced by @PassionStudios_
All the best guys!!👍🏽👍🏽👍🏽 pic.twitter.com/XDZ04FWXMk