'బాక్సర్' గా వరుణ్ అదుర్స్

విభిన్నమైన కథలు ఎంచుకోని సక్సెస్ లు కొడుతున్నాడు హీరో వరుణ్ తేజ్ .. సినిమా సినిమాకి వేరియేషన్స్

Update: 2020-01-19 08:55 GMT

విభిన్నమైన కథలు ఎంచుకోని సక్సెస్ లు కొడుతున్నాడు హీరో వరుణ్ తేజ్ .. సినిమా సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక గత ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో మంచి హిట్టు అందుకున్న వరుణ్ ప్రస్తుతం మరో విభిన్నమైన కథతో ముందుకు వస్తున్నాడు. ఈ రోజు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అయన నూతన చిత్రం బాక్సర్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇందులో వరుణ్ తేజ్ బాగా పెరిగిన గడ్డంతో, తలకు నిట్ క్యాప్ ధరించి పంచింగ్ బ్యాగ్ పై చెమటలు చిందేలా ప్రాక్టీస్ చేస్తూ.. కండలు తిరిగిన శరీరంతో బాక్సర్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకోసం వరుణ్ ప్రత్యేకంగా నీరజ్‌ గోయత్‌ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్దా, అల్లు వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వేసవిలో రిలీజ్ చేయనున్నారు. 


Tags:    

Similar News