సైరా నరసింహారెడ్డి సినిమాపై ముదురుతున్న వివాదం..చిరంజీవి, రామ్‌చరణ్‌పై కేసు..

Update: 2019-09-21 14:33 GMT

భారీ హిస్టారికల్ చిత్రం సైరా నరసింహారెడ్డిపై వివాదం ముదురుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాపై కేసు నమోదు కావడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అన్యాయం జరిగిందని బ్రిటిష్ రాజ్యం మీద పోరుకు సిద్దమయ్యాడు నరసింహరెడ్డి. అయితే, రీసెంట్‌గా నరసింహా రెడ్డి వారసులు మాత్రం.. కోణిదల ప్రొడక్షన్స్ పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు.

తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కుతున్న సైరా సినిమాపై.. ఉయ్యలవాడ వారసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. మోసపూరిత మాటలతో మోసం చేసిన కొణిదల ప్రొడక్షన్ అధినేతలు చిరంజీవి, రాంచరణ్ ల మీద కేసు పెట్టారు. తమను మోసం చేసింది కాక, తమపైనే చిరంజీవి, రాంచరణ్ తప్పుడు కేసులు పెట్టారని నరసింహా రెడ్డి వారసులు ఆరోపిస్తున్నారు.

సినిమా మొదలు పెట్టినప్పుడు తమకు రామ్ చరణ్ సాయం చేస్తానని చెప్పారు. నరసింహా రెడ్డి వారసులు 25మంది వున్నారని ప్రతి కుటుంభానికి ఆర్ధిక సహాయం చెయ్యడమే కాకుండా వారిని వారసులుగా ప్రపంచానికి పరిచయం చేస్తానని చెప్పారని ఇప్పుడు మాట తప్పారని ఆరోపిస్తున్నారు. దాదాపు మూడువందల కోట్ల భారీ బడ్జెట్ తో ఒక తిరుగుబాటు వీరుని కథ చెప్పడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కథను తమనుంచి సేకరించి తమపైనే తప్పుడు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ లో పెట్టారని అన్నారు.

బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఉయ్యాలవాడకి చేసిన అన్యాయానికి కొణిదెల కుటుంబం చేస్తున్న అన్యాయానికి తేడా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. తొలి స్వతంత్ర సమరయోధుడు కథను అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకోవడమే కాకుండా, ఆ కుటుంభీకులను బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేంది లేదని ఉయ్యాలవాడ వారసులు స్పష్టం చేశారు.  

Full View

Tags:    

Similar News