విభిన్నమైన సినిమాలు తీస్తూ ప్రేక్షకులలో మంచి నటుడు అనిపించుకున్న హీరో ఉపేంద్ర ..కన్నడ స్టార్ అయినప్పటికీ తెలుగులో కూడా కన్యాదానం, రా, టాస్, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలలో నటించి ఇక్కడ కూడా మంచిఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ రియల్ స్టార్.. ఇప్పుడు అయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులలో ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడుతుంది.
ఇప్పుడు 'కబ్జ' అనే మరో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఉపేంద్ర.. 1947-80 మధ్యలో వచ్చిన అండర్ వరల్డ్ డాన్ గా కథాంశంతో తెరకెక్కుతుంది. పాన్ ఇండియన్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ నిన్న రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. ఈ సందర్భంగా మూవీలో ఉపేంద్ర లుక్ విడుదల చేశారు మేకర్స్. ఆ తర్వాత ఉపేంద్ర పైన సన్నివేశాన్ని చిత్రీకరించారు
ఆర్ .చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మొత్తం ఏడూ బాషలలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో మొత్తం ఏడుగురు విలన్స్ ఉండనున్నారని తెలుస్తుంది. బాలీవుడ్‌కు చెందిన నానా పటేకర్, మనోజ్ బాజ్‌పాయ్, ప్రకాశ్‌రాజ్, జగపతి బాబు, జయప్రకాశ్ రెడ్డి , ప్రదీప్ రావత్, సముద్రఖనిలని విలన్స్‌గా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. దీనితో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.