మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన విజయ్
ఈ ఏడాది వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ..
ఈ ఏడాది వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కరొనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది.
ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు ఒకే చెప్పాడట... ఈ విషయాన్ని విజయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నిన్నుకోరి', 'మజిలీ' ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా ప్రముఖ నిర్మాత దిల్రాజు బ్యానర్లో మరో సినిమా చేస్తున్నారట్టు విజయ్ వెల్లడించాడు. ప్రస్తుతం ఈ సినిమాకి దర్శకుడిని ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నారట.. త్వరలో దీనికి సంబంధించిన విషయాలు ఆఫీషియల్ గా బయటకు రానున్నాయి.