ఆ యోధులందరికీ వందనం ... మహేష్ ఎమోషనల్ పోస్ట్

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు అన్ని పోరాటం చేస్తున్నాయి. ఇక భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ ని విధించారు.

Update: 2020-04-07 15:16 GMT
Mahesh Babu (File Photo)

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనిని అరికట్టేందుకు ప్రపంచదేశాలు అన్ని పోరాటం చేస్తున్నాయి. ఇక భారత్ లో 21 రోజుల లాక్ డౌన్ ని విధించారు. ఎవరు బయటకు రావొద్దని, అత్యవసర విషయంలో బయటకు వచ్చినప్పటికీ సామజీక దూరం పాటించాలని కోరారు. ఈ లాక్ డౌన్ లో ప్రజలను కాపాడడానికి వైద్యులు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. వారిని ఉద్దేశించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేడు (ఏప్రిల్ 7) ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆయన ఈ పోస్ట్ పెట్టారు.

" రెండు వారాల లాక్‌డౌన్.. మనం శక్తివంతమవుతున్నాం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు ఐక్యంగా చేపట్టిన ప్రయత్నాలను కచ్చితంగా మెచ్చుకోవాలి. కోవిడ్-19పై మనం చేస్తోన్న యుద్ధంలో ముందు వరుసలో నిలబడిన వారందరికీ ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన ఆరోగ్యం కోసం వారు పోరాడుతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వీధులు, ఆసుపత్రుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతోన్న ఆ యోధులందరికీ వందనం. వారందరినీ దేవుడు చల్లగా చూడాలి" అని పోస్ట్ చేశారు.

ఇక భారత్ లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా భాదితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వ‌ర‌కు భార‌త్‌లో కరోనా వైర‌స్ వ‌ల్ల 117 మంది చ‌నిపోగా, 4421 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి 304 కేసులు నమోదు అయ్యాయి. ఇక తెలంగాణలో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..







Tags:    

Similar News