వినాశకాలే విపరీత బుద్ధి.. లాక్ డౌన్ పాటించని వారిపై మోహన్ బాబు ఫైర్

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2020-03-30 14:05 GMT
Mohan Babu (File Photo)

కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 25 మంది మృతి చెందారు. అయితే దీనిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ శక్తికి మించి ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలో భాగంగా ఎవరు బయటికి రాకూడదని, సామాజిక దూరం పాటించాలని, దీనివలన కరోనా వైరస్ నీ అరికట్టవచ్చని చెప్పుకొచ్చింది. ఇక సినీ తారలు కూడా కరోనా పై అవగాహన ని కల్పిస్తున్నారు.

అయితే జనాలు ఇదేమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు. అలాంటి వారిపై సినీ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు మోహన్ బాబు.. ఇందులో మోహన్ బాబు మాట్లాడుతూ.. పెద్దల మాటలను గౌరవించకపోతే ఏం జరుగుతుందో కూడా మీకు తెలిసుంటుంది అంటూ భారత, భాగవత, రామాయణ గాథలను గుర్తుచేశారు.

ప్రధాని మోదీతో సహా ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండండి అంటూ సూచిస్తున్నప్పటికి వాళ్ల ఇష్టప్రకారం న‌డుచుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. పెద్దల మాటలను గౌరవించునప్పుడే మ‌నం బాగుంటాం, ప‌క్కింటివాళ్లూ బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది, యావ‌త్ ప్రపంచ‌మూ బాగుంటుందని అన్నారు. ఇక అతి త్వర‌లో ఈ క‌రోనా నుంచి మ‌నంద‌రం త‌ప్పించుకొని క్షేమంగా ఉండాల‌ని కోరుకుంటున్నానని అని మోహన్ బాబు పేర్కొన్నారు.  


Tags:    

Similar News