పోలీసులకి, వైద్యులకి సహకరించండి! .. టైం పాస్ కోసం రోడ్లపైకి రావద్దు: విజయ్ దేవరకొండ

కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక భారత్ లో కూడా ఏడూ వేలకి పైగా ఈ వ్యాధి సోకింది.

Update: 2020-04-12 05:45 GMT
Vijay Devarakonda

కరోనా వైరస్ .. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక భారత్ లో కూడా ఏడూ వేలకి పైగా ఈ వ్యాధి సోకింది. అయితే దీని ప్రభావం ఎక్కువగా తెలుగు రాష్ట్రాల పైన పడకుండా ఉందంటే దానికి కారణం పోలీసు శాఖేనని అని యంగ్ హీరో విజయ్ దేవరకొండ అన్నాడు.. లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేయడానికి రోడ్లపై రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులకు ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్‌లను డాక్టర్స్ అసోసియేషన్ అందజేసింది. ఈ షీల్డ్‌ లను విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. " కరోనాని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం ఇంత స్ట్రిక్ట్‌గా లాక్‌డౌన్‌ను అమలు చేయడం హర్షించదగ్గ విషయం.. ఇక పోలీసులు కూడా 24 గంటలు మనకోసం పని చేస్తున్నారు.. వారికి మనస్ఫూర్తిగా పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. నేను ఇంటి నుంచి బయటికి వచ్చి 20 రోజులు అవుతుందని అన్నారు.

మన జనాభాతో పోలిస్తే మనకున్న పోలీసు యంత్రాంగం, డాక్టర్లు చాలా తక్కువని మనం బయటకు వచ్చి వారికి భారం కాకూడదని అన్నారు. ప్రభుత్వానికి , పోలీసులకి సహకరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని విజయ్ వెల్లడించారు. ఇక ఇప్పటికీ కొంత మంది టైమ్ పాస్‌కి రోడ్ల మీది తిరుగుతున్నారు. దయచేసి అలా చేయొద్దని విజయ్ చెప్పుకొచ్చాడు.



Tags:    

Similar News