కరోనా చైనా కుట్రే: నిఖిల్ సిద్ధార్థ్

కరోనా వైరస్ .. ఇప్పుడు ఎక్కడ చూసిన దిని గురించే చర్చ.. చైనాలోని వుహన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ చాలా మందిని పొట్టనపెట్టుకుంది.

Update: 2020-04-16 16:01 GMT
Nikhil Siddharth (file photo)

కరోనా వైరస్ .. ఇప్పుడు ఎక్కడ చూసిన దిని గురించే చర్చ.. చైనాలోని వుహన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ చాలా మందిని పొట్టనపెట్టుకుంది. 195 దేశాలకి పైగా విస్తరించి విలయతాండవం చేస్తుంది. ఈ వైరస్ బారినా పడి ప్రపంచవ్యాప్తంగా 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 1.30 లక్షలు దాటింది. ప్రస్తుతం దీనికి వ్యాక్సిన్ కనుకునేందుకు ప్రపంచదేశాలలోని శాస్త్రవేత్తలు తమ శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నారు. అయితే చైనా దేశం కావాలనే ఈ వైరస్‌ను పుట్టించి ప్రపంచ వ్యాప్తంగా బయోవార్‌కు తెరతీసిందని చాలా మంది వాదిస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ఏకంగా కరోనాను చైనీస్‌ వైరస్‌ అంటూ సంభోదించారు.

ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఇదే అంశంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించాడు. "చైనాలోని వుహన్‌ నగరంలో కరోనావైరస్‌ మొదటిసారి బయటపడింది. దీంతో అప్రమత్తమైన చైనా జనవరిలో వుహాన్‌ నగరం నుంచి ఇతర నగరాలకు డొమెస్టిక్‌ ఫ్లైట్స్‌తో పాటు ఇతర రవాణాలను నిలిపివేసింది. కానీ వుహన్‌ నగరం నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే విమానాలకు మాత్రం అనుమతి ఇచ్చింది. చైనా ఉద్దేశ పూర్వకంగా ఈ వైరస్‌ను ప్రపంచం మీదకి వదలకపోతే.. వుహన్‌ నుంచి అంతర్జాతీయ విమానాలను ఎందుకు నడిపింది" అని నిఖిల్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.

ఇక నిఖిల్ గత ఏడాది 'అర్జున్ సురవరం' సినిమాతో మంచి హిట్టు కొట్టాడు.. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకోని ఇప్పుడు వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. ఇప్పటికే కార్తీకేయ 2 సినిమాని మొదలుపెట్టిన నిఖిల్అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ నిర్మించబోయే సినిమాలో హీరో నిఖిల్ నటించబోయే '18 పేజెస్' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తన పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే.. 



Tags:    

Similar News