జక్కన్నకి కొత్త చాలెంజ్ విసిరిన అర్జున్ రెడ్డి దర్శకుడు
కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..
కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. దీనితో ప్రతి ఒక్కరూ గృహనిర్బంధంలోకి వెళ్ళిపోయారు. ఈ సమయంలో గృహనిర్బంధం పాటిస్తూనే తమ ఇళ్లలో స్వయం సేవకులుగా మారుతున్నారు. తాజాగా అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ తన ఇంటిపనుల్ని చేస్తున్న ఓ వీడియోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కి ఛాలెంజ్ గా విసిరారు..
'ఇంటిపనుల్ని మగవారు కూడా గొప్పగా చేస్తారు. క్వారంటైన్ వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నిజమైన పురుషుడెవరూ మొత్తం ఇంటి బాధ్యతల్ని మహిళలకే అప్పగించరు. స్త్రీలకు ఇంటిపనిలో మీరూ సహాయం చేయండి. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి రాజమౌళిగారిని ఓ వీడియో రూపొందించి షేర్ చేయాలని కోరుకుంటున్నా' అంటూ సందీప్ పేర్కొన్నారు.
అయితే సందీప్ రెడ్డి వంగ విసిరిన ఛాలెంజ్ ని రాజమౌళి స్వీకరించారు..ఈ రోజు(సోమవారం) వీడియోను పోస్ట్ చేస్తానని తెలిపారు. 'ఛాలెంజ్ అంగీకరించాను సందీప్. ఇంట్లో పని భారాన్ని మనం పంచుకోవడం ముఖ్యం. నేను ఈ రోజు ఇంట్లో పని చేసే ఆ వీడియోను షేర్ చేస్తాను.' అని రాజమౌళి పేర్కొన్నారు..
ఇక ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్అర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
Challenge accepted, Sandeep!
— rajamouli ss (@ssrajamouli) April 19, 2020
It is important we share the work load at home and I will post my home workout tomorrow... #BetheREALMAN https://t.co/cFxRikiJJE