మగధీరలో చరణ్ కి, ఆర్.ఆర్.ఆర్ లో చరణ్ కి తేడా ఇదే : రాజమౌళి

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం)..

Update: 2020-03-31 08:08 GMT
RRR

బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్.. (రౌద్రం, రణం, రుధిరం).. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఉగాది సందర్భంగా సినిమాకి సంబంధించిన లోగోను మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ' భీమ్ ఫర్ రామరాజు ' పేరిట అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని విడుదల చేసింది. సినిమా మోషన్ పోస్టర్ పక్కనపెడితే రామ్ చరణ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి హీరో రామ్ చరణ్ తేజ్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. మగధీర సినిమాలో రామ్ చరణ్ కి ఆర్ఆర్అర్ సినిమా లో రామ్ చరణ్ కి చాలా తేడా గమనించనని రాజమౌళి పేర్కొన్నారు.

మగధీర సినిమా సమయంలో చరణ్ అప్పుడే నటనని నేర్చుకుంటున్నాడు. ఇక రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ నటనలో చాలా మెట్లు ఎక్కేశాడు.ఆర్ ఆర్ ఆర్' షూటింగులో చరణ్ నటనను ఎంజాయ్ చేస్తూ చేయడాన్ని చూశాను. నటన పట్ల ఆయనకి గల అంకితభావాన్ని చూసి ఆశ్చర్యపోయాననీ రాజమౌళి వెల్లడించాడు.

ఇక దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటిచింది.కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాని వచ్చే ఏడాది 2021 జనవరి 8 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌ లతో పాటు హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్,సముద్రఖని,శ్రియ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇక బాహుబలి లాంటి సినిమా తర్వాత రాజమౌళి నుంచి సినిమా వస్తుండడం, ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి నటిస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ కథని అందించారు


Tags:    

Similar News