కోటి ముప్పై ల‌క్షల విరాళం ప్రక‌టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు.

Update: 2020-04-26 08:56 GMT
Vijay Devarakonda (File Photo)

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కొద్ది రోజులుగా విరాళం విష‌యంలో సైలెంట్‌గా ఉన్న విజ‌య్ రెండు చారిటీ సంస్థలను ఏర్పాటు చేశాడు. ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టి డి ఎఫ్), మిడిల్ క్లాస్ ఫౌండేషన్ (ఎం సి ఎఫ్) అనే రెండు ఛారిటీ విభాగాలను విజ‌య్ దేవ‌ర‌కొండ‌ స్టార్ట్ చేశారు. ఇందులో కోటి రూపయలతో మొదలైన ది విజయ్ దేవరకొండ ఫౌండేషన్(టి డి ఎఫ్) ఫౌండేషన్ తరపున కొందరు విద్యార్థులను ఎంపిక చేసి వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతానని ఈ యంగ్ హీరో చెబుతున్నాడు. ఈ ఫౌండేషన్ ద్వారా కొందరు విద్యార్థులను ఎంపిక చేసిన వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దుతారట విజయ్ ..

ఇక ఈ క‌రోనా సమయంలో నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న వారికోసం మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేశారు విజయ్ . 25లక్షల రూపాయలతో ఏర్పాటైన ఈ ఫౌండేషన్ కనీస అవసరాలు తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్న ఎవరికైనా thedeverakondafoundation.org వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమ డిటైల్స్ నమోదు చేసుకుంటే ఫౌండేషన్ సభ్యులు స్వయంగా వారికీ నిత్యావసర సరుకులు అందిస్తారట. ఇలా 2000 కుటుంబాల అవసరాలని ఎం.సి.ఎఫ్ ట్రస్ట్ తీర్చే ఉద్ధేశంగా పెట్టుకున్నట్టు విజయ్ తెలిపాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. పూరి, చార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం కరోనా ప్రాభవంతో సినిమా వాయిదా పడింది. సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. 


Tags:    

Similar News