ఎట్టకేలకు బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ.. వాటిని వైద్యులకే వదిలేయ్యలి అంటూ విజ్ఞప్తి

కరోనాతో ప్రపంచదేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. దీనిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించింది.

Update: 2020-04-07 16:35 GMT
Vijay Devarakonda (file Photo)

కరోనాతో ప్రపంచదేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. దీనిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించింది. దీనితో జన జీవనం ఎక్కడికక్కడే స్తభించిపోయింది. ఇక కరోనాపై జనాలలో అవగాహన కల్పించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు సెలబ్రిటీలు ముందుకు వచ్చి సోషల్ మీడియాలో పలు వీడియోలను చేశారు. అంతేకాకుండా మరో అడుగు ముందుకు వేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి విరాళాలను అందజేశారు. కరోనాతో అలమటిస్తున్న సినీ కార్మికుల కోసం విరాళాలను ప్రకటించారు.

అయితే ఇందులో యంగ్ హీరో విజయ్ దేవరకొండ కొంచం వేనుకున్నాడని చెప్పాలి. కరోనాపై సినీ ఇండస్ట్రీ ఒక పక్కా పోరాటం చేస్తుంటే విజయ్ దేవరకొండ మాత్రం రియాక్ట్ అవ్వలేదంటూ చాలామంది విమర్శలు గుప్పించారు. గతనెల 10న పబ్లిక్ సేఫ్టీ ఎనౌన్స్ మెంట్ అంటూ ఓసారి కనిపించిన విజయ్ మళ్ళీ కనిపించింది లేదు. పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. తాజాగా మళ్ళీ లైవ్ లో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.

ప్రస్తుతం కరోనా అత్యధికంగా వ్యాపిస్తున్న నేపధ్యంలో మాస్కులుకి కొరత ఏర్పడింది. అయితే దీనిపైన ఓ సందేశం ఇస్తూ ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ.. మాస్కుల కోసం ఎగబడకుండా ఏదైనా వస్త్రాన్ని ముఖానికి చుట్టుకోవాలని సూచిస్తున్నాడు. చేతికి రుమాలు, స్కార్ఫ్ లేదా చున్నీని ముఖానికి అడ్డంగా పెట్టుకోవాలని, మాస్కులను వైద్యుల కోసం వదిలేయాలని విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టాడు. తనే ముఖానికి ఓ వస్త్రాన్ని చుట్టుకొని దిగిన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు విజయ్.. చాలా రోజుల తరవాత సోషల్ మీడియాలోకి వచ్చిన విజయ్ పనిలో పనిగా సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీపైన ఏమైనా స్పందిస్తాడో లేదో అన్నది చూడాలి


Tags:    

Similar News