సినీ నటుడు శ్రీకాంత్‌ ఇంట విషాదం !

Update: 2020-02-17 05:46 GMT

ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మేక పరమేశ్వరరావు మరణించారు. శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వర్‌రావు(70) గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పరమేశ్వర్ రావు స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. పరమేశ్వర్‌రావు మృతితో శ్రీకాంత్‌ నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1948 మార్చి 16వ తేదీన కృష్ణాజిల్లా మేకావారి పాలెంలో జన్మించిన పరమేశ్వరరావు కర్ణాటక లోని గంగావతి జిల్లా బసవ పాలెంకు వలస వెళ్లారు. ఆయనకు భార్య ఝాన్సీ లక్ష్మి, కుమార్తె నిర్మల, కుమారులు శ్రీకాంత్, అనిల్ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తరువాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ వార్త తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు శ్రీకాంత్‌ ఇంటికి చేరుకుంటున్నారు. ఆయనకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


 

Tags:    

Similar News